ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam 2 : జ్యోత్స్న సవాల్.. దీపకి ఫ్రెండ్ లా కార్తీక్ ఉండగలడా!

on Oct 20, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -180 లో......అనసూయకి అమ్మని కార్తీక్ పెళ్లి చేసుకున్నాడని శౌర్య చెప్పగానే.. అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా మేనకోడలికి మంచి జీవితమిచ్చారు. మీకు ఋణపడి ఉంటానని అనసూయ అంటుంది. నా తమ్ముడు ఉంటే దీప పరిస్థితి ఇలా ఉండేది కాదని అనసూయ అనగానే..  కుబేర్ కి ఆక్సిడెంట్ అయిన విషయం కార్తీక్ గుర్తు చేసుకుంటాడు.

ఆ తర్వాత నాకు ఇంకా జ్యోత్స్న చెప్పింది నమ్మాలనిపించడం లేదని శివన్నారాయణ అంటాడు. అయితే వెళ్లి చూసి ఆశీర్వదించండి అని జ్యోత్స్న అంటుంది. ఒకసారి వదినకి ఫోన్ చేసి మాట్లాడతా అని కాంచనకి ఫోన్ చేస్తుంది సుమిత్ర. జ్యోత్స్న చెప్పేది నిజమేనా అని అనగానే.. నిజమే కానీ అని ఏదో చెప్పబోతుంటే.. ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదంటూ సుమిత్ర ఫోన్ కట్ చేస్తుంది. జ్యోత్స్న ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది. అసలు దీపని కార్తీక్ పెళ్లి చేసుకోవడమేంటని సుమిత్ర దశరథ్ తో అంటుంది. ఆ తర్వాత బావ నా గురించి కొంచెం ఆలోచించాలి కదా అని జ్యోత్స్న అనగానే.. అసలు నువ్వు తన మనసులో ఉంటే కదా అని పారిజాతం అంటుంది. దానిలో ఉందేంటి.. నాలో లేనిది ఏంటని జ్యోత్స్న అనగానే.. లౌక్యం అని పారిజాతం అంటుంది. నా మెడలో కట్టమని తీసుకొని వెళ్ళిన తాళిని.. దాని మెడలో కట్టాడు. ఆ తాళి నాది ఎలా వదిలేస్తానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాశీ, స్వప్న మాట్లాడుకుంటుంటే.. దాస్ వస్తాడు. అమ్మ ఫోన్ చేసి కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడని చెప్పిందంటూ వాళ్ళిద్దరికి దాస్ చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. మరుసటి రోజు ఇక నిర్ణయం మీదే అని దశరథ్ అనగానే.‌. నా ఫ్రెండ్ మనవడితో జ్యోత్స్న పెళ్లి అని శివన్నారాయణ‌ అంటాడు. జ్యోత్స్న చేసుకుంటుందనుకుంటున్నారా అని పారిజాతం అనగానే.. మరి ఎవరిని చేసుకుంటుందని శివన్నారాయణ అంటాడు. కాంచనతో మాట్లాడి దీపకి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోండి అని పారిజాతం అనగానే.. పారిజాతంపై శివన్నారాయణ‌ విరుచుకుపడతాడు.

ఆ తర్వాత అసలు బావ పెళ్లి చేసుకునేంతగా.. దీప ఏం చేసింది. నేను పరిచయం చేస్తేనే బావ కి దీప తెలుసు కదా.. ఇంకా ఏదైనా ఉందా అని తెలుసా అని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. అసలు దీపకి తన ఊళ్ళో ఉన్నప్పుడే కార్తీక్ పరిచయం.. ఇప్పుడు శౌర్య దగ్గరున్న సైకిల్ కార్తీక్ గిఫ్ట్ గా ఇచ్చేందే.. కార్తీక్ లండన్ నుండి వచ్చాక డైరెక్ట్ అక్కడికే వెళ్లాడని చెప్పగానే.. అసలు నాకు ఎందుకు చెప్పలే‌దని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న ఈ రోజు తారీకు రౌండ్ చేసుకో బావతో కాపురం ఎలా చేస్తుందో చూస్తాను.. బావనే నా మొగుడు అని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు అనుకున్నది జరిగేలా నేను చేస్తానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. అందరు వేసిన నిందలు నిజం చేశారు. నన్ను తల ఎత్తుకోకుండా చేశారు. ఎవరెన్ని అన్నా.. నేను తప్పు చెయ్యలేదని దైర్యంగా ఉన్నాను. నా అనుమతి లేకుండా తాళి కట్టే హక్కు ఎవరు ఇచ్చారని దీప అడుగుతుంది. నీ కూతురు ఇచ్చింది. అవసరం అయితే శౌర్య కోసం పెళ్లి చేసుకోకుండా ఫ్రెండ్ లా ఉండిపోతానని కార్తీక్ అనగానే ఫ్రెండ్ లా ఉండాలంటే వాళ్ళ అమ్మ మెడలో తాళి కట్టాలా అని దీప అడుగుతుంది. ఫ్రెండ్ లా ఉండాలంటే తాళి కట్టాల్సిన అవసరం లేదు.. కానీ నాన్నలా ఉండాలంటే తాళి కట్టాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.